ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా రికార్డు

పదవీ విరమణ రోజున 65 తీర్పులు వెలువరించి జడ్జి

on-retirement-eve-delhi-high-court-judge-mukta-gupta-delivered-65-verdicts

న్యూఢిల్లీః ఢిల్లీ హైకోర్టు జడ్జి రికార్డు సృష్టించారు. పదవీ విరమణ రోజున ఏకంగా 65 కేసుల్లో తీర్పులు జారీ చేశారు. జస్టిస్ ముక్తా గుప్తాకు తన కెరీర్ లో సోమవారం చివరి పనిదినం. దీంతో ఆమె ఎన్నో ధర్మాసనాలకు నేతృత్వం వహించి వేగంగా తీర్పులు మంజూరు చేశారు. హత్యలు, అత్యాచార కేసులు, మరణశిక్ష పడిన ఖైదీలకు జీవిత ఖైదుగా తగ్గించడం వంటి తీర్పులు ఆమె జారీ చేసిన వాటిల్లో ఉన్నాయి.

హైకోర్టు జడ్జిగా 14 ఏళ్లపాటు జస్టిస్ ముక్తా గుప్తా సేవలు అందించారు. చివరికి మంగళవారం రిటైర్మెంట్ తీసుకున్నారు. దీంతో సోమవారం ఢిల్లీ హైకోర్టు అత్యంత సందడిగా, రద్దీగా మారిపోయింది. ఒకే రోజు భారీ సంఖ్యలో కేసులు విచారణకు రావడంతో న్యాయవాదులు, కేసుల్లో నిందితులు, సాక్షులతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది.