రేపే హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్
Huzurabad by-election polling tomorrow
హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ శనివారం జరగనుంది. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సిబ్బందికి విధుల కేటాయింపు జరగనుంది. ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 2,37,036. కాగా పురుషులు 1,17,933, స్త్రీలు 1,19,102 ఉండగా.. 14 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. 306 పోలింగ్ కేంద్రాల్లో…306 కంట్రోల్ యూనిట్స్‌తో పాటు 612 బ్యాలెట్ యూనిట్స్, 306 వివి ఫ్యాట్స్‌ను ఏర్పాటు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/