రోశయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

హైదరాబాద్: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన రోశ‌య్య ఇవాళ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. కొణిజేటి రోశ‌య్య గారి మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని త‌న ట్వీట్‌లో కేటీఆర్ తెలిపారు. ఓ సంద‌ర్భంలో రోశ‌య్య‌తో దిగిన ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. రోశ‌య్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/