భీమ్లా నాయక్​ ‘అడవి తల్లి’ సాంగ్​ విడుదల..

భీమ్లా నాయక్ నుండి నాల్గో సాంగ్ ‘అడవి తల్లి’ అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయ్యింది. వాస్తవానికి డిసెంబర్ 01 నే ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సిరివెన్నెల అకాల మరణంతో వాయిదా పడ్డ..ఈ సాంగ్ ఈరోజు ఉదయం విడుదలైంది. ‘అడవితల్లి మాట’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ , రానా కలయికలో వస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. ప్రతి రోజు ఏదొక అప్డేట్ ఇస్తూ సినిమా ఫై మరింత అంచనాలను పెంచేస్తున్నారు
మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్​ హీరోయిన్లుగా చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంత్రి కానుకగా జనవరి 12న రిలీజ్​ కానుంది

. https://www.youtube.com/embed/9WEvXJ8y2n8