ఓమిక్రాన్ ఎఫెక్ట్ : ఆర్టీసీ లో ప్రయాణం చేయాలంటే ఈ రూల్స్ పాటిచాల్సిందే..

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిందని అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ బయటకొచ్చింది. ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు వెలుగులోకి రాగా..ఇప్పుడు భారత్ లో కూడా కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే రెండు ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. గుజరాత్‌ లోని జామ్‌నగర్‌తో పాటు ముంబైలో కూడా కేసులు వెలుగు లోకి వచ్చాయి. జింబాబ్వే నుంచి నుంచి గుజరాత్‌ లోని జామ్‌నగ్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.

ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ ముందస్తు చర్యల్లో నిమగ్నమైంది. కొత్త నిబంధనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ కి సంబంధించి కొత్త నిబంధ‌న‌ల కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ జారీ చేశారు.

ఈ కొత్త నిబంధ‌నల‌ ప్ర‌కారం :

  • ఇక నుంచి ప్ర‌యాణికుల‌కు మాస్క్ ఉంటే నే బ‌స్సు లోకి అనుమ‌తి
  • బస్సులో కండ‌క్ట‌ర్ తో పాటు డ్రైవ‌ర్ త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాలి
  • ప్ర‌తి బస్సు లో శానిటైజ‌ర్ బాటిల‌ను అందుబాటు లో ఉంచుకోవాలి
  • కరోనా వైర‌స్ వ్యాప్తి గురించి అన్ని బ‌స్ స్టాప్ ల‌లో మైక్ ల‌తో ప్ర‌యాణికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి
  • రాష్ట్ర వ్యాప్తం గా అన్ని బ‌స్సుల‌ను, బ‌స్ స్టాప్ ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేయాలి
  • రెస్ట్ రూం ల‌లో స‌బ్బుల‌ను అందుబాటు లో ఉంచాలి అని తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ స‌జ్జ‌నార్ అధికారుల‌ను ఆదేశించాడు.