కామారెడ్డి జిల్లాలో చిరంజీవి ఫ్యామిలీ సందడి

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఈరోజు కామారెడ్డి జిల్లాలో సందడి చేయబోతున్నారు. గడి కోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు వివాహ సందర్భంగా చిరంజీవి , రామ్ చరణ్ , ఉపాసన తదితరులు కామారెడ్డి జిల్లాలోని.. దోమకొండ మండల కేంద్రంలోని గడికోట కు రానున్నారు. ఈ నేపథ్యంలో గడికోటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి ఫ్యామిలీ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఉదయం నుండే అక్కడికి చేరుకున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా దాదాపు షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్ర బృందం బిజీ గా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల కానుంది.