మరికాసేపట్లో గాంధీ భవన్ కు రోశయ్య భౌతికదేహం ..

మరికాసేపట్లో గాంధీ భవన్ కు రోశయ్య భౌతికదేహం ..
ex-cm-rosaiah-Funeral

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని అమీర్ పేట్లోని తన స్వగృహంలో ఉంచారు. సినీ , రాజకీయ ప్రముఖులంతా నిన్నటి నుండి చివరి చూపు చూసేందుకు వస్తున్నారు. మరికాసేపట్లో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని గాంధీభవన్ కు తరలించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం తరఫున రోశయ్య అంత్యక్రియలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. కాగా రోశయ్య మృతి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.