నేడు నల్గొండ జిల్లా కు కెసిఆర్ పయనం
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబానికి పరామర్శ

Hyderabad : సీఎం కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా పర్యటన చేయనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య దశ దినకర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం నివాళులు అర్పించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నల్గొండకు వెళ్తారు. నల్గొండలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్ లో హెలి ప్యాడ్ పై 12 గంటలకు ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎమ్మె కిషోర్ ఇంటికి చేరుకుంటారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/