ఒమిక్రాన్‌ వ్యాప్తి… తమిళనాడులో కఠిన ఆంక్షలు

మాల్స్, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలి
పెళ్లిళ్లకు 100 మందికి మించి హాజరుకాకూడదు

చెన్నై : దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తమిళనాడులో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు అక్కడి స్టాలిన్ ప్రభుత్వం సిద్ధమైంది.

మాల్స్, సినిమా థియేటర్లు, బస్సులు, పార్కులు, జిమ్స్, సెలూన్లు, యోగా సెంటర్లు, మెట్రో రైళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. అన్నిచోట్ల శానిటైజర్లను ఉంచాలని, శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాతే లోపలకు పంపించాలని పేర్కొన్నారు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఈ నెల 10 వరకు ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు ఉంటాయి. పెళ్లిళ్లకు 100 మందికి మించి, అంత్యక్రియలకు 50 మంది కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/