గోవాలో కుప్పకూలిన మిగ్​-29కే యుద్ధ విమానం

navy-mig-29k-crashes-during-sortie-off-goa

న్యూఢిల్లీః గోవా తీరంలో ఓ మిగ్​-29 కే యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగానే మిగ్‌-29 కే కూలిపోయినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు. కాగా, మిగ్‌-29 కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్‌ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి. విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కూలిపోయింది. నేవీ అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టడం వలన పైలట్‌ సురక్షింతంగా బయటపడ్డాడు. శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు.

రష్యాలో తయారైన మిగ్‌-29 కే విమానాల్లో కే-36D-3.5 ఎజెక్షన్‌ సీటుతో అమర్చబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్‌ హ్యాండిల్‌ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్‌ ముందుకు ఎజెక్ట్‌ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం ఈ ఎజెక్షన్‌ సీటు ప్రత్యేకత. 2020 ఫిబ్రవరి, నవంబర్‌ నెలల్లో రెండు మిగ్‌-29 కే విమానాలు కూలిపోయాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/