కామారెడ్డి లో దారుణం ..వృద్ధురాలిని ఈడ్చికెళ్లి మరీ చంపేసిన వీధికుక్కలు

వీధికుక్కలు దాడులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో రాష్ట్రంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల్నే కాదు పెద్ద వారిని సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా కామారెడ్డి లో వృద్ధురాలిని ఈడ్చికెళ్లి మరీ చంపేశాయి.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో గురువారం ఉదయం ఇంటి బయట కూర్చున్న రామవ్వ (60)పైకి వీధికుక్కలు ఒక్కసారిగా ఎగబడ్డాయి. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే వీధికుక్కలను వెళ్లగొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన రామవ్వను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామవ్వ మరణించింది.