కేసీఆర్ చేతిలోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

bandi-sanjay

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ చేతిలోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో మిగతా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు రెట్టింపు ఉత్సాహం తో ఉన్నారు. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ విజయ భేరి మొదలైందని , తెలంగాణ లోను అదే రిపీట్ అవుతుందని అంటున్నారు.

ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ఎంపిక చేస్తారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక లోపాయికారీ ఒప్పందంతో జరుగుతుందని వ్యాఖ్యానించారు. అక్కడ ఎవరు గెలిచినా తిరిగి అధికార పార్టీలో చేరిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ రూ.కోట్ల నగదును ఖర్చు పెట్టారని ఆరోపించారు.