రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ..కేసీఆర్ ఫై రేవంత్ ఫైర్

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని..కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేధావులు, ఉద్యమకారులు కేసీఆర్కు ఎందుకు లొంగిపోయారని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను మరిచిపోవొద్దని..అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ లో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తి అయ్యింది. రేపటి నుండి మహారాష్ట్రలో మొదలుకాబోతుంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాహుల్ యాత్ర వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..టిఆర్ఎస్ పాలన పు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు కష్టపడి పండించిన పంటను కొనలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత.. పోతే ఎంత అని రేవంత్ విమర్శించారు. పండించిన పంటను కొనని ప్రభుత్వాలకు రైతులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మోడీ పాలనలో దేశం ప్రమాదాల వైపు వెళ్తుందని..వీటిని చూడలేక రాహుల్ పాదయాత్రతో కదంతొక్కారని చెప్పారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడుందా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు చేస్తే పురుగుల పడిపోతారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 16 రోజుల పాటు అలుపెరగకుండా పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డారని చెప్పారు. ఈ పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు తమ సమస్యలను రాహుల్ కు చెప్పుకున్నారన్నారు. మునుగోడులో మోడీ, కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేశారని , డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని..కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. మేధావులు, ఉద్యమకారులు కేసీఆర్కు ఎందుకు లొంగిపోయారని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను మరిచిపోవొద్దని..అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని ప్రశ్నించారు.