తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

నేటి నుండి అమల్లోకి

oil-companies-reduce-the-non-domestic-gas-cylinder-price

న్యూఢిల్లీః గ్యాస్ వినియోగాదారులకు ఊరట లభించింది. గ్యాస్​ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. గ్యాస్ సిలిండర్ ధర రూ. 85.5 మేర దిగి వచ్చింది. జూన్ ​1వ తేదీ నుంచే ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. ఇక 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.

కాగా, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు క్రమంగా తగ్గుతూనే వస్తున్నాయి. గత నెలలో సిలిండర్ ధర ఏకంగా రూ. 172 మేర దిగి వచ్చింది. మళ్లీ ఇప్పుడు సిలిండర్ ధర రూ. 85 మేర తగ్గింది. అంటే నెల రోజుల్లో సిలిండర్ ధర రూ. 250 మేర తగ్గిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏపీలో రూ. 1161గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 1155 ఉంది.