హైదరాబాద్‌ రహదారులపై దూసుకుపోనున్న అత్యాధునిక మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో

Latest Montra Electric Super Auto in Hyderabad

హైదరాబాద్‌: మోంట్రా ఎలక్ట్రిక్‌ హైదరాబాద్‌లో తన షోరూమ్‌ను ప్రారంభించింది. మరియు ప్రపంచస్థాయి 3 ఎస్‌ (సేల్స్‌, సర్వీస్‌, స్పేర్స్‌) సౌకర్యాలతో కూడిన వర్క్‌షాప్‌ను ఈ రోజు హైదరాబాద్‌ బోయినపల్లిలోని గ్రీన్‌హబ్‌ ఆటోమోటివ్స్‌లో తెలంగాణ కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీ చామకూర మల్లా రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి గౌరవ అతిధులుగా టీఐ క్లీన్‌ మొబిలిటీ – సీఈఓ, శ్రీ సుశాంత్‌ జెనా మరియు పార్ట్‌నర్లు శ్రీకాంత్‌ ఎల్లూరు, శ్రీ తేజ పవన్‌ కుమార్‌, శ్రీ కిరణ్‌ కుమార్‌ గంజి, శ్రీ విద్యాధర్‌ బి ఎం మరియు శ్రీ పాత లక్ష్మణ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మురుగప్ప గ్రూప్‌ వారసత్వం నుండి ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో, హైదరాబాద్‌, తెలంగాణ మార్కెట్‌లను తాకింది మరియు టెస్ట్‌ రైడ్‌లు / డెలివరీలకు అందుబాటులో ఉంచింది. ఏ ఇతర ఆటో కంటే కూడా అత్యంత విభిన్నమైన ఆకర్షణీయ డిజైన్‌తో, పరిశ్రమలోనే అత్యధిక సర్టిఫైడ్‌ పరిధి ఒక్క సింగల్‌ ఛార్జ్‌తోనే 197 కి.మీ. (టిపికల్ రేంజ్ 160 కి.మీ.) మరియు శక్తివంతమైన మోటారుతో, సూపర్‌ ఆటో ఇప్పటికే పరిశ్రమలో సంచలనాలను సృష్టించింది. హైదరాబాద్‌లోని గ్రీన్‌హబ్‌ ఆటోమోటివ్స్‌, 71, సౌజన్య కాలనీ, హెచ్‌పి పెట్రోల్‌ పంప్‌ ఎదురుగా, న్యూ బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, తెలంగాణ – 500011 చిరునామాలో డీలర్‌షిప్‌ను కస్టమర్‌లు నేరుగా సందర్శించవచ్చు లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో టెస్ట్‌ రైడ్‌ బుక్‌ చేసుకోవచ్చు (https://www.montraelectric.com/test-drive/).


ఈ సందర్భంగా శ్రీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్‌హబ్‌ ఆటోమోటివ్స్‌ ప్రఖ్యాత టీఐ క్లీన్‌ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటోను బోయినపల్లి కంటోన్మెంట్‌ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆటోలు బ్యాటరీలతో నడిచేలా రూపొందించబడ్డాయి మరియు వీటికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. కోరమాండల్‌ గ్రూప్‌ మొదటిసారిగా కాలుష్య రహిత ఆటోలను పరిచయం చేస్తున్నది. వీటికి డీజిల్‌ లేదా పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనాలు అవసరం లేదు మరియు విద్యుత్‌ బ్యాటరీలతో నడుస్తాయి. ఇవి అత్యాధునిక ప్రత్యేకతలను కలిగివున్నాయి, ఇవి విశాలంగా ఉండడంతో డ్రైవర్లు మరియు ప్రయాణీకులకు పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి.’’ శ్రీ సుశాంత్‌ జెనా, సీఈఓ, మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌ నగరానికి మా ఉత్పత్తిని తీసుకు వస్తున్నందుకు మరియు నగర ప్రయాణంలో స్వచ్చమైన పర్యవరణహిత రవాణాను ప్రవేశపెడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. సూపర్‌ ఆటో ఆవిష్కరణలతో నిండి వుంది మరియు మార్కెట్‌ను పునర్నిర్వచించగలదని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము. ఇంధనం మరియు నిర్వహణలో పొదుపుతోపాటు వినియోగదారులు తమ పెట్టుబడిపై అధిక రాబడిని పొందవచ్చు. మార్కెట్‌కి తీసుకువచ్చే వాటిలో నాణ్యతకు మా కంపెనీ ప్రసిద్ధి చెందింది మరియు అదే సూత్రం సూపర్‌ ఆటోకు కూడా వర్తిస్తుంది. మేము పరిశ్రమలో అత్యుత్తమ సేవను మరియు విడిభాగాలను అందిస్తున్నాము, తద్వారా కస్టమర్‌లు సూపర్‌ ఆటోను కొనుగోలు చేసినందుకు ఆనందిస్తారు. తెలంగాణ మాకు చాలా కీలకమైన మార్కెట్‌ మరియు రాష్ట్రం ఎలక్ట్రిక్‌ రవాణాను చురుకుగా ప్రోత్సహిస్తున్నది మరియు అందుకోసం బలమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. రవాణ రంగంలో సమూల మార్పులను తీసుకురానున్న ఈ ప్రయాణంలో భాగమైనందుకు గ్రీన్‌హబ్‌ ఆటోమోటివ్‌కు అభినందనలు.’’
మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో 60 ఎన్‌ఎమ్‌ యొక్క ఇండస్ట్రీ బెస్ట్‌ పీక్‌ టార్క్‌తో, 55 కెఎమ్‌పిహెచ్‌ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. వాహనాన్ని మరింత మెరుగ్గా నడపడం కోసం పార్క్‌ అసిస్ట్‌ మోడ్‌తో పాటు తక్కువ ఖర్చు కోసం మల్టీ డ్రైవ్‌ మోడ్‌లను కలిగి ఉంది. సౌకర్యవంతమైన ప్రీమియం డ్యూయల్‌ టోన్‌ సీటింగ్‌, సామాను కోసం విశాలమైన బూట్‌ స్పేస్‌ కలిగివుంది. డ్రైవర్లు తమ వాహన గణాంకాలతో పాటు మరిన్నింటిని ట్రాక్‌ చేయడానికి టెలిమాటిక్స్‌ మరియు మొబైల్‌ యాప్‌తో ఈ వాహనం లోడ్‌ చేయబడింది. 3 సంవత్సరాలు / 1 లక్ష కిమీ వారంటీతో పాటు, కంపెనీ 24X7 రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, 2 సంవత్సరాల పొడిగించిన వారంటీ ఎంపిక మరియు 3 సంవత్సరాల వార్షిక నిర్వహణ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నది.


బేస్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.3.02 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ పోస్ట్‌-సబ్సిడీ)తో మరియు పెద్ద బ్యాటరీతో అధిక రేంజ్‌ వేరియంట్‌ రూ.3.45 లక్షల ధరతో అందుబాటులో ఉంది. కస్టమర్‌కు ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడానికి మరియు చవకగా చేయడానికి కంపెనీ అనేక బ్యాంకులతో ఒప్పందాలను కలిగివుంది. మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమైనాయి మరియు ఆసక్తిగల కొనుగోలుదారులు డీలర్‌షిప్‌ వద్ద తిరిగి వాపసు తీసుకునే నామమాత్రపు మొత్తానికి రిజర్వ్‌ చేసుకోవచ్చు. గ్రీన్‌ హబ్‌ ఆటోమోటివ్స్‌, పార్ట్‌నర్‌, శ్రీకాంత్‌ ఎల్లూరు మాట్లాడుతూ, హైదరాబాద్‌ డీలర్‌షిప్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా వుందన్నారు. మోంత్రా ప్యాసింజర్‌ ఆటోలు మొదలుకుని కార్గో ఆటోల వరకు, ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్ళను కలిగి ఉందని, ఈ ప్రాంతంలో బుకింగ్‌లు పెరిగాయని, మేము అంతర్జాతీయ ప్రమాణాలతో అమ్మకాలు, విడిభాగాలు, సేవలను అందిస్తామని, మంచి ఫైనాన్స్‌ మరియు ఎక్స్‌ఛేంజ్‌ సదుపాయంతో కస్టమర్‌లకు మేము మంచి డీల్‌ను అందిస్తామని, అన్ని సౌకర్యాలతో ఈరోజు షోరూమ్‌ని ప్రారంభిస్తున్నామని’’ అన్నారు.


మొదటి దశలో టీఐ క్లీన్‌ మొబిలిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలలో వాహనాలను విడుదల చేస్తున్నది. సూపర్‌ ఆటో ఈ రాష్ట్రాల్లోని మల్టీ టచ్‌పాయింట్‌లలో అందుబాటులో ఉంటుంది మరియు మోంట్రా ఎలక్ట్రిక్‌ సూపర్‌ ఆటో గురించి తెలుసుకోవడానికి టిసిఐఎమ్‌ గరిష్ట టెస్ట్‌ రైడ్‌లను అందిస్తున్నది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రారంభించబడిన ఈ ప్రాడక్ట్‌ బ్రాండ్‌ వాగ్దానం చేసినట్లుగానే ఏప్రిల్‌ నెలలో రోడ్లపైకి వచ్చింది మరియు బలమైన డీలర్‌ నెట్‌వర్క్‌ ద్వారా సౌత్‌లోని అన్ని ప్రముఖ మార్కెట్‌లను కవర్‌ చేస్తుంది, సంవత్సరం చివరి నాటికి మరింత విస్తరించనున్నది.


టీఐ క్లీన్‌ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురించి :
టీఐ క్లీన్‌ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ యొక్క పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ, ఇది క్లీన్‌ మొబిలిటీలోకి ఫోకస్‌ చేసే లక్ష్యంతో 2022 ఫిబ్రవరి 12 నుండి అమలులోకి వచ్చింది. దీని వ్యాపార ప్రణాళికలలో భాగంగా, కంపెనీ ‘మోంట్రా ఎలక్ట్రిక్‌’ బ్రాండ్‌ పేరుతో ప్యాసింజర్‌ మరియు కార్గో విభాగాలలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్ల తయారీ మరియు మార్కెటింగ్‌ రంగంలోకి ప్రవేశించింది.


మురుగప్ప గ్రూప్‌ గురించి :
1900లో స్థాపించబడిన, రూ.547 బిలియన్లు (రూ.54,722 కోట్లు) విలువైన మురుగప్ప గ్రూప్‌ భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సమ్మేళనాలలో ఒకటి. మురుగప్ప గ్రూప్‌లో 29 వ్యాపారాలు ఉన్నాయి, వీటిలో పది లిస్టెడ్‌ కంపెనీలు ఎన్‌ఎస్‌ఈ & బీఎస్‌ఈ లో ట్రేడ్‌ చేయబడ్డాయి. చెన్నైలో ప్రధాన కార్యాలయం, గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలలో కార్బోరండమ్‌ యూనివర్సల్‌ లిమిటెడ్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌, చోళమండలం ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, చోళమండలం ఎమ్‌ఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, కోరమాండల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, ఈ.ఐ.డీ. ప్యారీ (ఇండియా) లిమిటెడ్‌, ప్యారీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, శాంతి గేర్స్‌ లిమిటెడ్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ మరియు వెండ్ట్‌ (ఇండియా) లిమిటెడ్‌. అబ్రాసివ్స్‌, టెక్నికల్‌ సెరామిక్స్‌, ఎలక్ట్రో మినరల్స్‌, ఆటో కాంపోనెంట్స్‌ & సిస్టమ్స్‌, పవర్‌ కన్వర్షన్‌ ఎక్విప్‌మెంట్‌, ట్రాన్స్‌ఫార్మర్లు & రియాక్టర్లు పవర్‌ టి & డి సెగ్మెంట్‌, రైల్వేస్‌ కోసం రోలింగ్‌ స్టాక్‌ & సిగ్నలింగ్‌ ఎక్విప్‌మెంట్‌, సైకిల్స్‌, ఫెర్టిలిస్‌ చక్కెర, టీ మరియు స్పిరులినా (న్యూట్రాస్యూటికల్స్‌).గ్రూప్‌ చిమిక్‌ ట్యునీసియన్‌, ఫోస్కోర్‌, మిట్సుయ్‌ సుమిటోమో, మోర్గాన్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, వంటి అనేక ఉత్పత్తులలో గ్రూప్‌ నాయకత్వ స్థానాన్ని కలిగి ఉంది. యన్మార్‌ & కో. మరియు కంపెనీ డెస్‌ ఫాస్ఫాట్‌ డి గఫ్సా (సిపిజి) వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో గ్రూప్‌ బలమైన పొత్తులను ఏర్పరచుకుంది. గ్రూప్‌ భారతదేశం అంతటా విస్తృత భౌగోళిక ఉనికిని కలిగివుంది మరియు 6 ఖండాలలో విస్తరించి ఉంది.బీఎస్‌ఏ, హెర్క్యులెస్‌, మోంట్రా, మాచ్‌ సిటీ, బాల్మాస్టర్‌, అజాక్స్‌, రోడియస్‌, ప్యారీస్‌, చోళా, గ్రోనర్‌, శాంతి గేర్స్‌ మరియు పారాఫోమ్స్‌ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌లు మురుగప్ప స్టేబుల్‌కు చెందినవి. గ్రూప్‌ వృత్తి నైపుణ్యం యొక్క వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది మరియు 59,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.
మరిన్ని వివరాల కోసం, https://www.murugappa.com/ ని సందర్శించండి.