జేబీఎస్ కు బయలుదేరిన బండి సంజయ్

టీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపు ఫై తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చార్జీల పెంపు ఫై ప్రయాణకులతో మాట్లాడేందుకు జేబీఎస్ బస్టాండ్ కు బయలుదేరారు. అందుకు ముందు ఉదయం బండి సంజయ్ ని హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. దీంతో బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ తురుపు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాసేపు తర్వాత బండి సంజయ్ బయటకు వచ్చి జేబీఎస్ కు బయలుదేరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారో అర్థం కాలేదు అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. అరెస్టులు, జైల్లకు భయపడనని స్పష్టం చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. అర్ధరాత్రి జిట్టా బాలకృష్ణా రెడ్డి ని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను అని అన్నారు. ఉద్యమకారులను అరిగోస పెడుతున్నారని, ద్రోహులను సంకన వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆర్టీసీ ప్రయాణికులతో మాట్లాడేందుకే జేబీఎస్ బస్టాండ్ కి వెళుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అంతకు ముందు జేబీఎస్ పేరుతో డిజిపి కార్యాలయం ముట్టడికి వెళ్తారనే అనుమానంతో పోలీసులు బండి సంజయ్ ని హౌస్ అరెస్టు చేశారు.