వారంరోజుల్లో డీఏవీ స్కూల్ రీఓపెన్కు అధికారుల హామీ

హైదరాబాద్ డీఏవీ స్కూల్ వారం రోజుల్లో రీఓపెన్ అవుతుందని అధికారులు హామీ ఇచ్చారు. విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు కమిషనర్ అంగీకరించారు. స్కూల్ మేనేజ్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లో స్కూల్ రీ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి.

పేరెంట్స్‌ ప్రధానంగా లేవనెత్తుతున్న 3 డిమాండ్లపై చర్చ జరిగింది. డీఏవీ స్కూల్‌ను రీ ఓపెన్ చేయాలని పేరెంట్స్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీఈవోకు డీఏవీ స్కూల్‌ పేరెంట్స్‌ వినతిపత్రాలు అందజేశారు. గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అలాగే భద్రతా చర్యలు తీసుకుంటామని డీఏవీ స్కూల్‌ మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. లోపాలను సరిదిద్దుకుంటామని కమిషనర్తో చెప్పామని స్కూల్ మేనేజర్ శేషాద్రి తెలిపారు. పేరెంట్స్ స్టేట్మెంట్తో పాటు తమ వినతిని కూడా అందించినట్లు తెలిపారు. గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరామని.. కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.