రాధే శ్యామ్ వాయిదా వార్తలపై నిర్మాతలు క్లారిటీ

నిన్నటి వరకు జనవరి 07 న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుందని అంత అనుకుంటున్నా వేళ..ఈ మూవీ వాయిదా పడిందనే వార్త అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్..మరోసారి కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా , ఓమిక్రాన్ వైరస్ కారణంగా పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ లతో పాటు థియేటర్స్ మూతపడడంతో నిర్మాతలు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కావడం తో ఇది కూడా వాయిదా పడనుందనే వార్తలు వైరల్ గా మారాయి. దీంతో చిత్ర నిర్మాతలు రిలీజ్ ఫై క్లారిటీ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో జనవరి 14న సినిమా అంటూ స్పష్టం చేశారు “రాధేశ్యామ్” మూవీ మేకర్స్. దీనిని బట్టి చూస్తే రాధే శ్యామ్ వాయిదాపడడం లేదని అర్ధమవుతుంది. మరి ఆర్ఆర్ఆర్ ప్లేస్ లో ఏ మూవీ వస్తుందో తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ మూవీస్ వల్ల భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా వేశారు. మరి ఆ సినిమానే వస్తుందా..లేక నాగార్జున – చైతూల బంగార్రాజు వస్తుందా అనేది చూడాలి.

ఇక రాధేశ్యామ్ విషయానికి వస్తే..ఇక ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించగా. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తుండగా.. భాగ్యశ్రీ , జగపతిబాబు , ప్రియదర్శి , సత్యరాజ్ , కునాల్ రాయ్ కపూర్ , సచిన్ ఖేడ్కర్ , మురళి శర్మ , ఎయిర్ టెల్ శాషా ఛత్రి , రిద్ది కుమార్ , సత్యన్ ఇతర పాత్రలు పోషించారు.