ఒడిషాలో లాక్‌డౌన్ పొడిగింపు

జులై 1 వ‌ర‌కూ పొడిగింపు..ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

భువ‌నేశ్వ‌ర్ : ఒడిషాలో లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌ను కొన్ని స‌డ‌లింపుల‌తో జులై 1 వ‌ర‌కూ పొడిగించాల‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణయించింది. నెలాఖ‌రు వ‌ర‌కూ వారాంతాల్లో క‌ఠిన లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో చ‌త్తీస్ ఘ‌ఢ్‌, జార్ఖండ్ స‌రిహ‌ద్దుల‌ను తెర‌వాల‌ని ఒడిషా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే ఏపీ, బెంగాల్ స‌రిహ‌ద్దుల్లో నియంత్ర‌ణ‌లు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ఇక ఒడిషాలో బుధ‌వారం 3535 తాజా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, మహ‌మ్మారి బారిన‌ప‌డి ఒక్క‌రోజులో 44 మంది మ‌రణించారు. రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 6.72 శాతంగా ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana