ఈమందుతో కరోనా రోగులు త్వరగా కోలుకుంటారు

కరోనాకు ఔషధాన్ని అభివృద్ధి చేశాం… చైనా పరిశోధకుల ప్రకటన

china-develops-drugs-for-coronavirus

చైనా: ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచేస్తుంది. ఈనేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది. కరోనాను అరికట్టడానికి తాము ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు చైనాలోని పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. తాము అభివృద్ధి చేసిన ఈ మందును వాడినట్లయితే కరోనా రోగులకు త్వరగా నయం అవుతుందని, వారి రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ ఔషధ ప్రయోగాల్లో భాగంగా రోగం బారిన పడిన ఎలుకలకు న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ ఎక్కించామని, ఐదు రోజుల తర్వాత వాటిలో వైరస్‌ ప్రభావం 2500 యూనిట్లకు పడిపోయిందని చెప్పారు. ఈ డ్రగ్‌ను కరోనా చికిత్స విధానంలో ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు చెప్పారు. దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాల్సి ఉందని, వచ్చే ఏడాది దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/