BARC రేటింగ్స్ లో No .1 స్థానంలో NTV ..

రెండు తెలుగు రాష్ట్రాల్లోని న్యూస్ చానెల్స్ లలో ఎన్టీవీ దూకుడు కనపరుస్తుంది..ఒకటి , రెండు వారాలు కాదు 16 వారాలుగా BARC రేటింగ్స్ లో No .1 స్థానంలో ఎన్టీవీ హావ కొనసాగిస్తూ..మిగతా చానెల్స్ కు చెమటలు పట్టిస్తుంది. ఏంచేస్తున్నారా..ఎలాంటి న్యూస్ అందిస్తున్నారా బాబు..అసలు ఎలా వస్తున్నాయి ఈ ఐడియాస్ అనుకునేలా.. ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలు , బ్రేకింగ్ న్యూస్.. స్పీడ్ న్యూస్, ఆఫ్ ది రికార్డ్, స్టోరీ బోర్డ్, ఫోకస్ న్యూస్ వంటివి అందిస్తూ.. No .1 ఛానల్ గా దూసుకెళ్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సమస్య ను బయటకు తీసుకొస్తూ.. ప్రతి అన్యాయాన్ని నిజాయితీగా భయపడకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడం NTV చేస్తుంది. అన్ని చానెల్స్ మాదిరిగా గంటలు గంటలు డిబేట్ లు ..గొడవలు ..అరసుకోవడాలు వంటివి చేయకుండా స్పీడ్ న్యూస్, ఆఫ్ ది రికార్డ్, స్టోరీ బోర్డ్, ఫోకస్ న్యూస్ వంటి వాటిపై ఫోకస్ చేసి ప్రజలకు కొత్త న్యూస్ ను అందించే ప్రయత్నం చేస్తుంది. అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీ అనేది చూడకుండా ఎవరికీ కొమ్ముకాయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడం చేస్తూ వచ్చింది.

దీంతో ప్రజలు ఒకప్పటి టాప్ చానెల్స్ ను ..ఎప్పటి నుండి మీడియా లో పాతుకుపోయిన చానెల్స్ ను పక్కకు పెట్టి కేవలం NTV ని చూడడం మొదలుపెట్టారు. దీంతో గత 16 వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో BARC రేటింగ్ లో NTV నెం.1గా కొనసాగుతూ వస్తుంది. 82 రేటింగ్ పాయింట్లతో NTV టాప్ ప్లేస్ లో ఉంటె TV9 58, V6 30, TV5 24, ABN 18 రేటింగ్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు సామాన్య ప్రజలతో పాటు రాజకీయనేతలు , పలు రంగాలకు చెందిన వ్యక్తులు సైతం NTV వార్తలనే చూసేందుకు ఇష్టపడుతున్నారు.