పుట్టిన రోజు నాడు సమంత కు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

నటి సమంత పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు , సినీ ప్రముఖులు , నటి నటులు సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఆమెకు షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. శివనిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ – సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గా ప్రారంభం జరిగిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లోజరుగుతుంది.

గురువారం సమంత పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేసారు. రొటీన్‌గా బర్త్ డే సర్ ప్రైజ్ ఇవ్వకుండా.. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఒక ఫేక్ సీన్‌ను క్రియేట్ చేశారు. సమంత ఆ సీన్‌ను నిజమనుకుని నమ్మేసింది. క్యాంప్ ఫైర్ వద్ద విజయ్‌తో సీన్‌లో లీనమైంది. పాత్రలో ఒదిగిపోయి డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. అనంతరం విజయ్ దేవరకొండ తన డైలాగ్ చెబుతూ.. ‘‘సమంత’’ అనేశాడు. దీంతో అతడు పొరపాటున సమంత అని అనేసాడనుకొని సమంత వెంటనే నవ్వేసింది. ఆ వెంటనే విజయ్ ఆమెకు ‘హ్యాపీ బర్త్ డే’ సమంతా అని చెప్పాడు. దీంతో ఒక్కసారి షాకింగ్‌కు గురైన సమంత.. కొద్దిసేపు అందరివైపు చూస్తూనే ఉంది. చిత్రయూనిట్ కూడా పెద్ద కేక్ సమంత ముందు పెట్టి విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

YouTube video