ఇది పద్ధతి కాదు అంటూ ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ వార్నింగ్..

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కించిన ఈ మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లలో బిజీ బిజీ అయ్యారు. తాజాగా చిత్ర యూనిట్ ముంబై లో భారీ ఈవెంట్ ఏర్పటు చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా సల్మాన్ , కరణ్ జోహార్ లు హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కు హాజరు కావడం ..బారికేట్లు ఎక్కి ఇబ్బంది చేయడం తో ఎన్టీఆర్ కాస్త అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆదివారం ముంబైలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా దీనికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోనికి చొచ్చుకున్నాడు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అందరూ కిందకు దిగుతారా? లేదా? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి అంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

https://youtube.com/watch?v=csIYDbVbPx8