కరోనాపై అప్రమత్తమైన ట్రంప్‌ ప్రభుత్వం

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ.. ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్

Trump declares national emergency over coronavirus
Trump declares national emergency over coronavirus

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అమెరికాలో ట్రంప్‌ సర్కార్‌ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (హెల్త్ ఎమర్జెన్సీ) విధించారు. అలాగే, నివారణ చర్యల కోసం 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నిన్న వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ట్రంప్ కరోనా బాధితులను కలుసుకున్న నేపథ్యంలో.. తాను ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయించుకోలేదని, చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను ట్రంప్ కలిశారు. తాజాగా ఫాబియోకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా, బోల్సోనారోకు మాత్రం కరోనా సోకలేదని తేలింది. ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. తాను దాదాపు రెండు గంటలపాటు బోల్పోనారోతో కలిసి ఉన్నట్టు చెప్పారు. ఇద్దరం కలిసి భోజనం చేశామని, పక్కపక్కనే ఉన్నామని పేర్కొన్నారు. అయితే, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకలేదని తేలిందని, కాబట్టి తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని ట్రంప్ వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/