తారక్‌తో అండర్ వాటర్ సీక్వెన్స్.. జక్కన్నా మజాకా!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ప్రెస్టీజయస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో తారక్‌తో జక్కన్న కొన్ని అదిరిపోయే సీక్వెన్స్‌లు చేయిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో తారక్‌తో ఓ భారీ పులి ఫైట్ సీన్‌ను జక్కన్న తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో సీక్వెన్స్ గురించి సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తారక్‌తో ఓ అండర్ వాటర్ సీక్వెన్స్‌ను రాజమౌళి ఇటీవల తెరకెక్కించాడట. ఈ సీక్వెన్స్‌ను భారీ బడ్జెట్‌తో షూట్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాజమౌళి తారక్‌ను ఓ రేంజ్‌లో చూపెట్టనున్నాడనే వార్తకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక కొమురం భీం పాత్రలో తారక్ నటవిశ్వరూపాన్ని మనకు చూపించనున్న జక్కన్న, అటు అల్లూరి సీతారామరాజుగా చరణ్‌తో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తున్నాడట. ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.