కన్ఫం: తారక్‌తో మరోసారి కొరటాల మంత్రం!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రానే వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగా తారక్ 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం లేదు. గతంలో ఈ ప్రాజెక్టును ఆయనే పట్టాలెక్కించాలని చూసినా, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పక్కనపెట్టాడు. దీంతో తారక్ మరో డైరెక్టర్‌ను ఓకే చేసి, దీనికి సంబంధించిన అప్డేట్ను తాజాగా అనౌన్స్ చేశారు.
తనదైన చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో, తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. గతంలో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన కొరటాల, మరోసారి తారక్‌కు అంతకు మించిన హిట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేనితో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో, తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నిరోజుల అయోమయానికి తారక్ ఎట్టకేలకు చెక్ పెట్టాడని వారు అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.