మూడు వారాలపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు – సీఎం కేసీఆర్ ఆదేశాలు

మూడు వారాలపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గురువారం సచివాలయంలో అధికారులతో సమావేశమైన కేసీఆర్.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణపై కలెక్టర్లకు వివరించారు. జూన్ 2 నుంచి 22 వరకు అంటే మూడు వారాలపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరపాలని పేర్కొన్నారు. దీనికి సంబదించిన రోజువారీ కార్యక్రమాలను తెలిపారు.
జూన్ 2: ఉత్సవాల ప్రారంభోత్సవం
జూన్ 3: తెలంగాణ రైతు దినోత్సవం
జూన్ 4: సురక్షా దినోత్సవం
జూన్ 5: విద్యుత్తు విజయోత్సవం
జూన్ 6: పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
జూన్ 7: సాగునీటి దినోత్సవం
జూన్ 8: ఊరూరా చెరువుల పండుగ
జూన్ 9: తెలంగాణ సంక్షేమ సంబురాలు
జూన్ 10: సుపరిపాలన దినోత్సవం
జూన్ 11: సాహిత్య దినోత్సవం
జూన్ 12: తెలంగాణ రన్
జూన్ 13: మహిళా సంక్షేమ దినోత్సవం
జూన్ 14: వైద్యారోగ్య దినోత్సవం
జూన్15: పల్లె ప్రగతి దినోత్సవం
జూన్ 16: పట్టణ ప్రగతి దినోత్సవం
జూన్ 17: తెలంగాణ గిరిజనోత్సవం
జూన్ 18: మంచి నీళ్ల పండుగ
జూన్ 19: తెలంగాణ హరితోత్సవం
జూన్ 20: విద్యా దినోత్సవం
జూన్ 21: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
జూన్ 22: అమరుల సంస్మరణ