ముంబయిలో క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్‌పై ఆంక్ష‌లు

ఒమిక్రాన్ వేళ ముంబయిలో 144 సెక్ష‌న్‌


ముంబయి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోన్న నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 32 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర రాజ‌ధాని ముంబయిలో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 16 నుంచి 31వ తేదీ వ‌ర‌కు 144 సెక్ష‌న్ విధించారు. క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. జ‌నాలు ఎవ‌రూ గుమిగూడొద్ద‌ని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని పోలీసులు విజ్ఞ‌ఫ్తి చేశారు.

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 77 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 32 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లో 17 కేసులు, ఢిల్లీలో 10, కేర‌ళ‌లో ఐదు, గుజ‌రాత్‌లో నాలుగు, క‌ర్ణాట‌క‌లో మూడు, తెలంగాణ‌లో రెండు, బెంగాల్, ఏపీ, చండీఘ‌ర్‌, త‌మిళ‌నాడులో ఒక కేసు చొప్పున న‌మోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/