రైతుల అవసరాలకు పెద్దపీట

సాగర్ మిత్రల ఏర్పాటు ద్వారా సాయం

farmers -Nirmala Sitharaman
farmers -Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ‘అన్నదాతా సుఖీభవ’ అన్నట్లు సాగింది. రైతులకు అన్ని రూపాల్లో మేలు జరిగేలే ప్రభుత్వం పలు నిర్ణయాలు ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించడం వల్ల రైతులకు మేలు జరగనుంది. అలాగే, రైతులకు 20 లక్షల సోలార్ పంపు సెట్ల పంపిణీ, బీడు భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, భూసార పరిరక్షణకు సాయం, రసాయన ఎరువుల నుంచి విముక్తి కలిగించడం, గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు, పీపీపీ పద్దతిలో సాయం అందించడం వల్ల కూడా రైతులు ప్రయోజనం పొందుతారు.

ధాన్యం కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్ జీలకు సాయం చేయాలని నిర్ణయించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాలని, వర్షాభావ జిల్లాలకు సాగునీటి సదుపాయం కల్పనకు అదనపు నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. 3400 సాగర మిత్రల ఏర్పాటు, కూరగాయల సరఫరాకు ‘కృషి ఉడాన్ యోజన’ ప్రారంభిం చనున్నారు. కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమాభివృద్ధి పై మరింత సాయం చేయనున్నట్లు మం త్రి ప్రకటించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/