‘బింబిసార’ఫై ఎన్టీఆర్ రివ్యూ

కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న చిత్రం బింబిసార. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రివ్యూ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూసారు. సినిమా చాల బాగుందని కితాబు ఇచ్చినట్లు తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లపై దృష్టి సారించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ఆకట్టుకోగా..ఈ మూవీ ప్రివ్యూను యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ చూశారట. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్​పై ప్రశంసలు కురిపించారట. మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, కళ్యాణ్​ రామ్​ సక్సెస్​ అవ్వడం ఖాయమని చెప్పారట. ఈ వార్త తో నందమూరి అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అతృతతో ఉన్నారు.