సరిహద్దుల్లో 60,000 మంది చైనా సైనికులు..పాంపియో

china-has-deployed-60-000-soldiers-on-indias-northern-border-mike-pompeo

వాషింగ్టన్‌: భారత్‌ స‌రిహ‌ద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహ‌రించిన‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో వెల్ల‌డించారు. అమెరికా, జ‌పాన్‌, భారత్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న క్వాడ్ గ్రూపు సమావేశం జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జరిగింది. భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తోనూ పాంపియో ఈ సందర్భంగా భేటీ అయ్యారు. అనంతరం పాంపియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార‌త స‌రిహ‌ద్దుల్లో చైనా దాదాపు 60 వేల మంది సైనికుల్ని మోహ‌రించిన‌ట్లు చెబుతూ, చైనా తీరును ఆయన ఖండించారు. చైనా త‌న చెడు ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టిందని, క్వాడ్ దేశాల‌కు చైనాతో ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. ఇండో ప‌సిఫిక్ స‌ముద్ర ప్రాంతంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలిపారు. భారత్‌లోని వాస్త‌వాధీన రేఖ వెంట డ్రాగన్ తీరు బాగోలేదని చెప్పారు. ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్‌లో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/