టిఆర్ఎస్ నేతల ఫై పీయూష్‌ గోయల్‌ ఆగ్రహం ..

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

నిరుపేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మాదిరిగా అన్యాయం చేసిన ప్ర‌భుత్వం దేశంలో మ‌రొక‌టి లేద‌ని గోయల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఓ విఫ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. దేశ ప్ర‌ధానితో పాటు కేంద్ర మంత్రుల‌పైనా టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు బాధాక‌ర‌మ‌ని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని భావించి వెంటనే వడ్లు, బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకు క్లియరెన్స్‌ ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్‌ స్టాక్‌ నిల్వలు సరిగా లేవని అన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగాయని అందుకే ఈ చర్చ తీసుకున్నామని తెలిపారు. తమ చర్చల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగులు చేయడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం మండిపడ్డారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు నష్ట పోతున్నారని, పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం 3నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పంపిణీ చేయడం లేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు.