గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన జూ. ఎన్టీఆర్

బుధువారం రాత్రి పలువురు సినీ ప్రముఖులకు జూ ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వికపూర్ నటిస్తుంది. ఇదిలా ఉంటె ఎన్టీఆర్‌ బుధవారం రాత్రి తన ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీకి పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలతో పాటు అమెజాన్‌ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌ హాజరయ్యాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను. ముఖ్యంగా జేమ్స్, ఎమిలీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన మంచి మాటలకు, పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివతో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్‌, నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌లు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.