పుష్ప 2 సెట్ లో ఎన్టీఆర్ సందడి

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పుష్ప 2 సెట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సందడి చేసారు. పుష్ప భారీ విజయం సాధించడం తో పుష్ప 2 ఫై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయినా టీజర్ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో శరవేగంగా జరుగుతోంది. బన్నీ సహా ప్రధాన పాత్రధారులపై ఇందులో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ సెట్ లో తారక్ ప్రత్యక్షం అయ్యారు. బుధవారం జూనియర్ ఎన్టీఆర్ సెట్ లోకి వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. ఫార్మల్ డ్రెస్ లో వున్న ఎన్టీఆర్ లోపలికి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. కాస్త గ్యాప్ లభించడంతో తారక్ .. పుష్ప సెట్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.