రైళ్ల వేగాన్ని పెంచిన దక్షిణ మధ్య రైల్వే

Maximum train speed increases to 130 kmph in SCR Zone

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే రైళ్ల వేగం పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేప‌రిధిలో ప్ర‌యాణం చేసే రైళ్ల గ‌రిష్ట వేగం గంట‌కు 110 కిమీగా ఉండేది. కాగా ఇప్పుడు ఈ గ‌రిష్ట‌వేగాన్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ మార్గంలో ప్ర‌యాణం చేసే రైళ్లు గంట‌కు 110 కిమీ నుంచి 130 కిమీల‌కు పెంచుతూ ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే నిర్ణ‌యం తీసుకున్న‌ది. సికింద్రాబాద్‌, విజ‌య‌వాడ‌, గుంత‌క‌ల్ డివిజ‌న్ల‌లోని అత్య‌ధిక సెక్ష‌న్ల‌లో ఇక‌పై రైళ్లు గ‌రిష్ట‌వేగంతో ప్ర‌యాణం చేస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఈరోజు నుంచి పెంచిన వేగంతో రైళ్లు ప్ర‌యాణాలు చేయ‌నున్నాయి. రైళ్లు ప్రయాణించే వేగానికి త‌గిన విధంగా ట్రాక్‌ల‌ను సిద్ధం చేశారు. అయితే ప్ర‌స్తుతం ఈ వేగం కేవ‌లం ఎల్‌హెచ్‌బీ బోగీలున్న రైళ్ల‌కే ప‌రిమితం కానున్నాయి.

ఎల్‌హెచ్‌బీ బోగీలను గ‌రిష్టంగా 160 కిమీ వేగంతో ప్ర‌యాణం చేసేలా తీర్చిదిద్దారు. పాత‌త‌రం ఐసీఎఫ్ బోగీల గ‌రిష్ట వేగం 110 కిమీ వేగంతో మాత్ర‌మే ప్ర‌యాణం చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. అయితే, ట్రాక్‌ల ప్ర‌మాణాల‌ను మ‌రింత‌గా పటిష్టం చేసి, సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా పెంచ‌గ‌లిగితే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్న రైళ్లు గ‌రిష్టంగా 160కిమీ వేగంతో ప్ర‌యాణం చేయ‌గ‌ల‌వు. దూర‌ప్రాంతాల‌కు ప్ర‌యాణం స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌కాజీపేట్‌బల్లార్ష, కాజీపేట్‌కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లివిజయవాడగూడూరు, గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంటగుంతకల్‌వాడి సెక్షన్లు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ సెక్షన్లు మొత్తం రద్దీగా ఉంటాయి, స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాలుగా ఉన్నాయి. వీటిలో స్వర్ణ వికర్ణ మార్గంలో విజయవాడ దువ్వాడ మధ్య సెక్షన్‌ను మినహాయించబడిరది. ఇక్కడ వేగం పెంపుకు సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

పాతతరం ఐసీఎఫ్ కోచ్‌ల సామర్థ్యం ఉన్న రైళ్ల సామర్థ్యం గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్లే. గోదావరి, గోల్కొండ, నారాయణాద్రి, రాయలసీమ, తెలంగాణ, తిరుపతి-జమ్ముతావి హమ్‌సఫర్, లింగపల్లి-విజయవాడ ఇంటర్‌సిటీ, దక్షిణ్, చార్మినార్, గుంటూరు ఇంటర్‌సిటీ, జైపుర్, ఎల్‌టీటీ దురంతో, కాగజ్‌నగర్, విశాఖపట్నం డబుల్ డెక్కర్, ధర్మవరం, కోకనాడ సహా 37 రైళ్లే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్నాయి.