పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించడం కరెక్టే!

సినిమాలు మాత్రం ఆపొద్దని ఆయనకు అప్పుడే చెప్పా!

undavalli arun kumar
undavalli arun kumar

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించాలని మొట్టమొదట కలసినప్పుడే చెప్పానని మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. ఈ రోజు ఆయన చాలా రోజుల తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన వృత్తి సినిమాలే కాబట్టి సినిమాలు మాత్రం ఆపొద్దని ఆయనకు అప్పుడే సూచించానని తెలిపారు. అయితే రాజకీయాలు, సినిమాలు రెండూ కుదరవని పవన్‌ చెప్పాడని, కానీ ఇప్పుడు కుదురుతోందని అన్నారు. అప్పట్లో పవన్‌ సీఎం అయ్యే అవకాశాలున్నాయని భావించి సినిమాలు వద్దనుకొవచ్చు, ఇప్పుడు నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించడం కరక్టేనని, అదే సరైన నిర్ణయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/