తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల
Sabitha Indra Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in  వెబ్‌సైట్లలో విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/