రేపు థియేటర్స్ లలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల..థియేటర్స్ కు సెక్యూరిటీ ఇవ్వండి అంటూ పోలీసులకు పిర్యాదు

రేపు థియేటర్స్ లలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల..థియేటర్స్ కు సెక్యూరిటీ ఇవ్వండి అంటూ పోలీసులకు పిర్యాదు

గత కొద్దీ నెలలుగా ఎదురుచూస్తున్న అసలు సిసలైన ట్రైలర్ మరికొద్ది గంటల్లో వచ్చేసింది..ఇంతకీ ఆ ట్రైలర్ ఏంటి అనుకుంటున్నారా..అదే ఆర్ఆర్ఆర్ ట్రైలర్. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో పాటు బాలీవుడ్ , హాలీవుడ్ స్టార్స్ నటించడం తో ఈ సినిమా ఫై అందరిలో ఆసక్తి నెలకొనింది. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడిన ఈ మూవీ…జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఫై దృష్టి సారించింది. ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసి ఆకట్టుకోగా…డిసెంబర్ 09 న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.

మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న వందల సంఖ్యలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించడానికి థియేటర్స్ రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో మా రెండు థియేటర్స్‌కు ప్రొటెక్షన్ కావాలని, వైజాగ్‌కు చెందిన థియేటర్స్ సంగం, శరత్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారు ఓ రిక్వెస్ట్ లెటర్‌ను పోలీసులకు అందచేశారు.

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్స్‌కు వచ్చే అవకాశం ఉండటం వల్లే ఇలా విశాఖ ఏసీపీకి బందోబస్త్ నిమిత్తం ముందస్తు ప్రణాళికగా లెటర్ అందచేశారు. ఇంతకముందు ఇదే థియేటర్స్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసినపుడు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ఆ ధాటికి అద్దాలు కూడా పగిలిపోయి..కొందరు గాయాలపాలయ్యారు. అందుకే ఈసారి అలా జరగకుండా జాగ్రత్తపడేందుకే థియేటర్స్ యాజమాన్యం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.