చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు నాన్ వెజ్ బంద్

చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు చికెన్, మటన్ పెట్టటడం లేదు. మహిళా కారాగారంలోనూ ఖైదీలకు రెండు వారాలుగా చికెన్, మటన్ పెట్టడం లేదు. దీనికి కారణం మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ. 2 కోట్ల వరకూ బకాయి ఉండడమే. బాకీలు చెల్లించకపోవడం సదరు కాంట్రాక్టర్‌ నాన్ వెజ్ ను అందివ్వడం లేదు.

దీంతో గత రెండు వారాలుగా ఖైదీలు నాన్ వెజ్ లేకుండానే గడిపేస్తున్నారు. బడ్జెట్ విడుదల కాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తుంది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్,..మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. కేవలం ఈ రెండు జైల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జైళ్లలో పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.