పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

తక్షణం అమల్లోకి వస్తాయన్న ఆయిల్ కంపెనీలు

LP Gas Cylinder
LP Gas Cylinder

న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర సిలిండర్ కు గరిష్ఠంగా రూ. 4.50 వరకూ పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో రూ. 4.50, చెన్నైలో రూ. 4, ముంబైలో రూ. 3.50, ఢిల్లీలో రూపాయి చొప్పున ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ రేటు హైదరాబాద్ లో రూ. 645.50, ఢిల్లీలో రూ. 594, కోల్ కతాలో రూ. 620.50, ముంబయిలో రూ. 594, చెన్నైలో రూ. 610కి చేరుకున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/