చైనాపై మరింత కోపం పెరుగతుంది..ట్రంప్
కరోనా వైరస్ విషయంపై చైనాపై మండిపడ్డ ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనా కారణమని అమెరికా అధ్యక్షడు డొనాల్ట్ ట్రంప్ ఆరోపించారు. ఇప్పటికే అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తోడు ఈ కరోనా పోరాటం ఇరు దేశామధ్య వైరాన్ని మరింతగా పెంచుతోంది. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ట్రంప్‌కు చైనాపై కోపం కట్టలు తెంచుకుంటోందట. ఈ అంటువ్యాధిని పూర్తిగా నియంత్రించే స్థితిలో తాములేమని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. ఈనేపధ్యంలో ట్రంప్ ఒక ట్వీట్ చేస్తూ… అమెరికాకు ఈ మహమ్మారి వల్ల కలిగే భారీ నష్టంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధిని గమనిస్తున్నప్పుడు చైనాపై తనకు ఎక్కడలేని ఆగ్రహం కలుగుతున్నదని పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/