ఎమ్మెల్సీ పదవులకు మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ రాజీనామా

ఇటీవల రాజ్యసభకు ఎన్నికలు..గెలిచిన ఇరువురు నేతలు

mopidevi-and-pilli-resign-to-mlc-posts-today

అమరావతి: ఏపిలో ఇటివల రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి తరఫున మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. వీరు ఇరువురూ గతంలో ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవులను కూడా అనుభవించిన సంగతి తెలిసిందే. ఆపై ఇద్దరినీ రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వీరు గత నెల జరిగిన ఎన్నికల్లో గెలిచారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లోగా తమ పదవులకు రాజీనామా చేయడం తప్పనిసరి కావడంతో, నేడు ఇరువురు నేతలూ అసెంబ్లీకి వచ్చి కార్యదర్శికి రిజైన్ లెటర్లను అందించనున్నారని వైఎస్‌ఆర్‌సిపి నేతలు తెలిపారు. రాజ్యసభ తదుపరి సెషన్ లో వీరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/