ప్రముఖ డైరెక్టర్ కు నెల రోజులు జైలు శిక్ష

ప్రజిన్‌ హీరోగా బాలాజీ దర్శకత్వం వహించిన డీ3 సినిమాను బి మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేకేఎం ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించగా.. గతేడాది మార్చిలో ఈ సినిమా విడుదలైంది. అయితే, సినిమా మేకింగ్ కోసం సామువేల్‌ గాడ్సన్‌ వద్ద రూ.4 కోట్లు తీసుకున్న నిర్మాత మనోజ్‌ 60 శాతం సినిమా హక్కులను సామువేల్‌కి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమాను విడుదల చేశారంటూ సామువేల్‌ గాడ్సన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డీ3 సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు నిషేధం విధించింది. అంతే కాకుండా సినిమా ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. కానీ ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఓటీటీలో సినిమాను విడుదల చేశారని డైరెక్టర్‌ బాలాజీ, నిర్మాత మనోజ్‌లపై సామువేల్‌ గాడ్సన్‌ కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. బాలాజీకి నెల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.