రేపు ఛత్తీస్​గఢ్​లో 70 అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో తుది దశ పోలింగ్

Chhattisgarh polls.. Stage set for second phase voting of 70 seats tomorrow

రాయ్‌పూర్‌ : రేపు( శుక్రవారం) ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ రెండో(తుది) విడత ఎన్నికలు జరుగనున్నాయి. 22 జిల్లాల్లోని 70 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. వీటిలో నక్సల్‌ ప్రభావిత బంద్రనవాగఢ్‌ నియోజకవర్గం ఉన్నది. మొత్తంగా 70 స్థానాల్లో 958 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సీఎం భూపేశ్‌ బఘేల్‌ పోటీచేస్తున్న పాటన్‌ స్థానం ఈ దశలోనే ఉన్నది. దాదాపు 1.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 700 ‘సంగ్వారి’ పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందిగా కేవలం మహిళలే ఉంటారని ఓ అధికారి తెలిపారు. ఈనెల 7న మొదటి విడతలో భాగంగా 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండో దశ ఎన్నికలకు బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజెపి పెద్దయెత్తున ప్రచారం నిర్వహించాయి.