ఆరేళ్ల చిన్నారి ఫై తెరాస లీడర్ అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలో అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట చిన్నారి ఫై అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. సామాన్య ప్రజలే కాదు అధికార పార్టీ కి చెందిన లీడర్స్ సైతం చిన్నారుల ఫై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆరేళ్ల చిన్నారి ని అత్యాచారం చేసాడు తెరాస లీడర్. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

కోనరావుపేట మండలానికి చెందిన గిరిజన దంపతులు ఆరేండ్ల పాపతో కలిసి ఉద్యోగరీత్యా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో టీఆర్ఎస్​ లీడర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అయిన శంకర్​ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. శంకర్ ​మండల స్థాయి లీడర్ ​కాగా, ఆయన భార్య ఆ ఊరి సర్పంచి. ఈ నెల 27న పాప తల్లిదండ్రులిద్దరూ తమ పనుల నిమిత్తం వెళ్లారు. ఇంట్లో టీవీ లేకపోవడంతో చిన్నారి శంకర్​ ఇంట్లో చూసేందుకు వెళ్లింది. ​ఇంట్లో ఎవరూ లేనిది చూసి శంకర్ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

గురువారం చిన్నారికి బాగా జ్వరం వచ్చింది. నొప్పి అంటూ బాధపడుతుండటంతో తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా.. జరిగిన విషయం చెప్పింది. శంకర్​ను నిలదీయగా.. ఎవరికైనా చెప్తే బాగుండదని బెదిరిస్తూ గొడవకు దిగాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ​శుక్రవారం ఎల్లారెడ్డి పేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని రిమాండ్​కు తరలించారు. చిన్నారికి న్యాయం చేయాలంటూ ఎల్లారెడ్డిపేటలో గిరిజన నాయకులు, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల లీడర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.