ఏపీ లో నామినేటెడ్​ పోస్టుల ప్రకటన

135 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

YouTube video
Press Conference by Hon’ble Minister for Home, BC Welfare & Other Dignitaries at R&B Building, Vija

విజయవాడ: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. ఇవ్వాళ విజయవాడలో ఆ భర్తీల వివరాలను హోం మంత్రి సుచరితతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 135 కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 56 శాతం పదవులను కేటాయించారు. 68 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు.

వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్ పర్సన్ గా గాదల బంగారమ్మ, మేరిటైం బోర్డు చైర్మన్ గా కాయల వెంకట్ రెడ్డి, టిడ్కో చైర్మన్ గా జమ్మాన ప్రసన్న కుమార్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గా నెక్కల నాయుడు బాబు, ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్. రామారావు, తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నరమల్లి పద్మజ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరి, విమెన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా హేమ మాలిని రెడ్డిలను నియమించారు.

కాగా, పదవుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించామని సజ్జల అన్నారు. పదవులేవీ అలంకార ప్రాయం కాదన్నారు. పదవులు పొందిన వారంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 76 పదవులను ఇచ్చామని ఆయన చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/