ఢిల్లీలో స‌రి-బేసి విధానం నిర్ణయం వాయిదా

No odd-even rule in Delhi for now as air quality improves

న్యూఢిల్లీ: ఢిల్లీలో స‌రి-బేసి విధానం అమ‌లును వాయిదా వేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. న‌వంబ‌ర్ 13 నుంచి 20 వ‌ర‌కు స‌రి-బేసి విధానంలో వాహ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌భుత్వం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే కాలుష్యం స్థాయి త‌గ్గ‌డంతో.. ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు మంత్రి రాయ్ తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇటీవ‌ల 450 ప‌స్ల్ ఉండేద‌ని, కానీ ఇప్పుడు ఆ ఎయిర్ క్వాలిటీ 300కు చేరుకుంద‌ని, దీని వ‌ల్లే స‌రి-బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అయితే దీపావ‌ళి త‌ర్వాత మ‌ళ్లీ స‌రి-బేసి విధానంపై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.