నేడు రాజధాని పిటిషన్లపై విచారణ

త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్

Ap High Court
Ap High Court

Amaravati: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన 54 వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. గత నవంబరు, డిసెంబర్​లో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాజధాని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపింది. జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఆ వ్యాజ్యాల విచారణ నిలిచిపోయాయి. దీంతో రాజధాని వ్యాజ్యాలపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/