ప్రజలకు జనసేన పార్టీ విజ్ఞప్తి..కేవలం సమస్యలతోనే రావాలి

రేపటి నుంచి జన వాణి-జనసేన భరోసా కార్యక్రమం

Pawan Kalyan's criticism of the AP government
Pawan kalyan

అమరావతిః ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు జులై 3న విజయవాడలో జనసేన పార్టీ జన వాణి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రజల నుంచి సమస్యల తాలూకు విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చేవారు శాలువాలు, బొకేలతో రావొద్దని స్పష్టం చేసింది.

దయచేసి ఈ వేదికపై శాలువాలతో సత్కరించడం, బొకేలు ఇచ్చేందుకు సమయం వృథా చేయవద్దని సూచించింది. కేవలం సమస్యలతోనే రావాలని ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు భరోసా నింపేందుకు జన వాణి-జనసేన భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రజా సమస్యల వేదికగా మలచాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని జనసేన పార్టీ వివరించింది. ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/