హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరు

bjp-national-office-bearers-meeting-started-in-hyderabad

హైదరాబాద్‌ః హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయింది. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులందరూ సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీనికి తోడు దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/